ఉత్తరాంధ్ర ఐదవ భక్త సమ్మేళనం
ఉత్తరాంధ్ర ఐదవ భక్త సమ్మేళనం
శ్రీకాకుళం జిల్లా, టెక్కలి శ్రీ రామకృష్ణ సేవా సమితి 2023 డిసెంబర్ 8, 9,10 తేదీల్లో 'ఉత్తరాంధ్ర రామకృష్ణ- వివేకానంద భావప్రచార పరిషత్’ ఐదవ వార్షిక భక్త సమ్మేళనాన్ని టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో అత్యంత భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించింది. 8వ తేదీన విద్యార్థులతో ఊరేగింపు, తరువాత వివిధ కళాశాలలకు చెందిన 2,500 మంది విద్యార్థులతో 'యువజన సదస్సు' జరిగాయి. 9, 10 తేదీల్లో జరిగిన 'భక్తుల సదన్సు'లో సుమారు 3,500మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వామీజీలు, మాతాజీలు, ఇతర వక్తలు ప్రసంగించారు. భక్త బృందాల భజనలు; వివేకానందుని బాల్యం, సంఘజనని శ్రీ శారదాదేవి అంశాలపై టెక్కలి బాలికల వసతిగృహం విద్యార్థులు, పలాస విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరని ఆలరించాయి.
ఫోటోలు
ప్రసంగాలు
కార్యక్రమ వివరాలు
ఫోటోలు
ప్రసంగాలు
కార్యక్రమ వివరాలు