శ్రీ రామకృష్ణ సేవా సమితి - భావనపాడు 1979 లో ప్రారంభించబడింది. 2001 లో సమితి రిజిస్ట్రేషన్ చేయడమైనది. సమితి ప్రారంభించిన నాటి నుండి గ్రామంలో మరియు పరిసర ప్రాంత గ్రామాల్లో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. 2018 లో నూతన దేవాలయం నిర్మించి పరమ పూజ్య స్వామి గౌతమానందజీ మహారాజ్ వారి కరకమలములచే ప్రారంభోత్సవం చేయడమైనది. ప్రతి రోజు దేవాలయంలో ఉదయం పూజ సాయంత్రం ఆరాత్రికం నిరాటంకంగా జరుగుతున్నాయి. ఉచితంగా విద్యార్థులు కోసం ట్యూషన్ సెంటర్ నడుపుచున్నాము. సుమారు 300 మంది మంత్రం దీక్ష తీసుకున్న భక్తులు ఉన్నారు. యువత సహాయం కూడా సమితిలో మరువలేనిది.