శ్రీ రామకృష్ణ సేవా సమితి, కాకినాడ
శ్రీ రామకృష్ణ సేవా సమితి, కాకినాడ
శ్రీరామకృష్ణ సేవాసమితి, కాకినాడ 1940 సంవత్సరము నుండి భక్తుల గృహములలో నిర్వహించబడినది. 30-03-1985 సంవత్సరమున కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు లీజుపై ఇచ్చిన 1.47 ఎకరముల భూమియందు శ్రీమత్ స్వామి రంగనాధానందాజీ మహరాజ్, అద్యక్షులు, రామకృష్ణమఠం, హైదరాబాద్ వారిచే దేవాలయము మరియు పాఠశాలకు శంఖస్థాపనజరిగినది. తదుపరినిర్మాణము జరిగినది. శ్రీ రామకృష్ణ ధ్యాన మందిరము మరియు వివేకానంద ఆడిటోరియం మహరాజ్ 11-02-1996 సంవత్సరము శ్రీమత్ స్వామి తత్వబోధానందజీ మహరాజ్, శ్రీమత్ స్వామి స్వాత్మానందజీ మహరాజ్, శ్రీమత్ స్వామి పరమార్థానందజీ మహరాజ్ ప్రారంభించినారు.
శ్రీరామకృష్ణ సేవాసమితి నందు, ధ్యాన మందిరము, వివేకానంద ఆడిటోరియం, సాధునివాస్, గ్రంధాలయము, ఉచిత హోమియో వైద్యశాల, శ్రీ రామకృష్ణ (E.M) స్కూలు (LKG నుండి 10 వ తరగతి వరకు) రెండు ఫ్లోర్లు కలవు.
రిజిస్ట్రేషన్ నెంబరు: 114/1985
రెన్యూవల్ తేది :15-04-2023.
ఆధ్యాత్మిక కార్యక్రమములు :
- మూర్తిత్రయము జయంతులు,
- కల్పతరువుదినోత్సవము,
- శ్రీరామ నవమి, కృష్ణాష్టమి, వినాయకచతుర్థి, సరస్వతిపూజ, ఉగాది,
- గురుపూర్ణిమ, దసరా, సంక్రాంతి,
- సెప్టెంబరు 11వతేదీ స్వామీజీ చికాగో నగర ఉపన్యాసముల సందర్భముగా కార్యక్రమములు,
- జపసాధనలు, స్వామీజీలచే ఆధ్యాత్మిక కార్యక్రమములు నిర్వహించబడుచున్నవి.