Skip to main content
ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్
ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్

శ్రీ రామకృష్ణ సేవా సమితి, కొత్త అగ్రహారం

                                                   

ప్రారంభము :

శ్రీ ఖర నామ సంవత్సరం ఫాల్గుణ బహుళ పాడ్యమి, శుక్రవారం 09-03-2012

ప్రారంభకులు

శ్రీ పూజ్య స్వామి జ్ఞానదానందజీ మహరాజ్, రామకృష్ణ మఠాధ్యక్షులు హైదరాబాద్

విశిష్ట అతిధులు

స్వామి అక్షరాత్మానందజీ  మహరాజ్ (రాజమండ్రి)

స్వామి రఘునాయకానందజీ మహరాజ్ (హైదరాబాద్)

స్వామి గుణేశానందజీ మహరాజ్ (విశాఖపట్నం)

డా.. పన్నాల శ్యామసుందర మూర్తి (గుంటూరు)

    రిజిస్ట్రేషన్ నెంబరు: 414/2022
    రెన్యూవల్ తేది : -
             ఆధ్యాత్మిక కార్యక్రమములు : 
    • నిత్యపూజ మరియు ఆరాత్రికం జరపబడుతుంది.
    • శ్రీరామకృష్ణ, శ్రీ మా శారదాదేవి, స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపబడుతున్నవి
    • ప్రతీ సంవత్సరం శ్రీకృష్ణాష్టమి నాడు భగవద్గీత పారాయణం జరురుబడుతుంది
    •  శ్రీ దుర్గా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 9 రోజులు సామూహిక కుంకుమ పూజ జరిపి శ్రీ లలితాదేవి విగ్రహంకు పూజలు జరిపి నిమర్జనం చేయడం జరుగుతుంది
    • కార్తీక మాసంలో 15 రోజులు ఉదయం నగర సంకీర్తన జరుపబడుతుంది. దీనిలో రోజూ 10-20 మంది భక్తులు పాల్గొంటారు
    • కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు ప్రతీ సంవత్సరం దీపోత్సవం జరుపబడుతుంది. దీనిలో గ్రామ ప్రజలు 100-150 మంది పాల్గొంటారు
    • శ్రీ రామకృష్ణ జయంతి, శ్రీమా శారదాదేవి జయంతి, శ్రీ స్వామి వివేకానంద జయంతి నాడు మరియు కార్తీక మాసంలో గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమం జరుపబడుతుంది. దీనిలో 1400-1500 పది మంది భక్తులు పాల్గొంటారు
    • అలాగే వినాయకచవితి, శ్రీరామనవమి వంటి ఉత్సవాలు దేవాలయంలో జరుపబడుతున్నాయి
             సేవా కార్యక్రమములు : 
    • జాతీయ యువజన దినోత్సవం నాడు మండల స్థాయిలో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ పెట్టి అతిధుల చేత బహుమతులు ప్రధానం చేయబడుతుంది
    • 35 మంది పిల్లలకు శ్రీమాశారదాదేవి ట్యూషన్ సెంటర్ ద్వారా ఉచిత ప్రైవేట్ తరగతులు జరుపబడుతున్నది
    • వేసవి కాలంలో చలివేంద్రం గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది
    • ప్రతి సంవత్సరం గ్రామంలో విశాఖపట్టణం శ్రీ రామకృష్ణ మిషన్ వారి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షల  సదుపాయం జరుపబడుతుంది
    • శ్రీ శారదాదేవి జయంతి సందర్భంగా పేద ముసలి వారికి చీరల పంపిణీ చేయబడుతుంది (20 మందికి ప్రతి సంవత్సరం)
    • ట్యూషన్ పిల్లలకు ప్రతి ఆదివారం బాల సంస్కార కేంద్రం నిర్వహించబడుతుంది. దీనిలో భగవద్గీత పారాయణం రామాయణ మహాభారత కథలు, దేశ నాయకుల చరిత్ర చెప్పబడుతుంది
    • ప్రతీ ఆదివారం ఉదయం RSS వారిచే పిల్లలకు శాఖ నిర్వహించి ఆటలు పెట్టడం జరుగుతుంది