Skip to main content
ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్
ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్

శ్రీ రామకృష్ణ సేవా సమితి, వేట్లపాలెం

                                                   
శ్రీరామకృష్ణ సేవాసమితి, వేట్లపాలెం 12 జనవరి 1992 న స్థాపించడం జరిగింది.  07-02-2001 తేదీన శ్రీమత్ స్వామి గౌతమానందజీ మహరాజ్, అధ్యక్షులు శ్రీరామకృష్ణ మఠం, చెన్నై వారిచే శ్రీరామకృష్ణ దేవాలయం ప్రారంబించడం జరిగింది. సేవాసమితిలో దేవాలయం, మీటింగు హాలు, విద్యార్థిని విద్యార్థులకు  శ్రీ శారదా బాల వికాస కేంద్ర భవనం (రెండు ఫ్లోర్లు) కలవు.  
రిజిస్ట్రేషన్ నెంబరు: 820 of 1992 Dt. 25-9-92

రెన్యూవల్ తేది : 01-07-2023.
         ఆధ్యాత్మిక కార్యక్రమములు : 
  • మూర్తిత్రయము జయంతులు
  • దుర్గాష్టమి
  • కల్పతరువుదినోత్సవము
  • ఇతర మూర్తులు శ్రీరామనవమి, కృష్ణాష్టమి, వినాయక చవితి, సరస్వతీ పూజ, ఉగాది 
  • మఠ స్వామీజీలచే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడును
         సేవా కార్యక్రమములు : 
  • 300 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ఉదయం, సాయంత్రం రోజూ ఉచిత   ట్యూషన్ సెంటరు
  • ప్రతి ఆదివారం బాలవికాస్
  • ప్రతీ సోమవారం ఉచిత హోమియో వైద్యం
  • మెడికల్ క్యాంపులు (కంటి, సుగర్, బీపీ, Dental)
  • మహిళలకు కుట్టశిక్షణ, painting, కుట్టులు, అల్లికలు నిర్వహించబడును.
  • మూర్తి త్రయము జయంతుల  సందర్భముగా ఆర్థికంగా వెనుక బడిన వారికి చీరలు, దుప్పట్లు, ఆర్థిక సహాయము
  • అతి తక్కువ ఫీజుతో స్కూలు నందు విద్యాబోధన, పరివర్తన (వీధి బాలలను చదివించే సంస్థ) ద్వారా  25 మంది విద్యార్థులకు ఉచిత విద్య, ఉచితంగా పుస్తకములు, యూనిఫాం అందచేయుట.

  • ప్రతి నెల 50 మంది HIV + ve ఉన్న బాల బాలికలకు ఉచిత హోమియో మందు మరియు పౌష్టికాహార కిట్లు అంద చేయుట.

  • ప్రతి గురువారం ఉచిత హోమియో వైద్యము మరియు ఉచిత మందుల పంపిణీ.
  • ప్రతి వేసవిలో 45 రోజులు చల్లని మజ్జిగ వితరణ.
         ఇతర కార్యక్రమములు : 
  • సెప్టెంబరు 11 స్వామి వివేకానంద చికాగో నగర ఉపన్యాసము సందర్భముగా స్కూలు, కాలేజీ విద్యార్థులకు పోటీలు నిర్వహించుట
  • జనవరి 12 జాతీయ యువజన దినోత్సవము సందర్భముగా వివేకానంద పార్కు నందు ప్రభుత్వ సంస్థలతో కలసి యువజన దినోత్సవము నిర్వహించుట
  • మఠ స్వామీజీల సహకారంతో కాలేజీలలో వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించుట
  • రామకృష్ణ మఠం స్వామీజీలచే నిర్వహించబడు జాగృతి పోటీలకు సహకారం అందించుట